సిగ్మా ఎలా తీశానో చూడటానికి నాన్న వెయిటింగ్‌‌‌‌ : జేసన్‌‌‌‌ సంజయ్

సిగ్మా ఎలా తీశానో చూడటానికి నాన్న వెయిటింగ్‌‌‌‌ :  జేసన్‌‌‌‌ సంజయ్

సందీప్ కిషన్‌‌‌‌ హీరోగా తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్‌‌‌‌ సంజయ్ తెరకెక్కించిన చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మైత్రి, ఎన్‌‌‌‌వీఆర్ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి.  అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘దర్శకుడిగా జేసన్‌‌‌‌ తొలిచిత్రం నాది కావడం సంతోషంగా ఉంది. 70 రోజుల్లో సినిమా తీస్తానని చెప్పి 63 రోజుల్లోనే పూర్తి చేశాడు. హండ్రడ్ పర్సెంట్‌‌‌‌ బౌండ్‌‌‌‌ స్క్రిప్ట్‌‌‌‌తో ఏ కథయితే చెప్పాడో అదే తీశాడు.

ఓ తెలుగు హీరోగా తమిళంలోనూ సినిమా చేయడం హ్యాపీ.  ఈ సినిమా అందరినీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది’ అని చెప్పాడు.  దర్శకుడు  జేసన్ సంజయ్ మాట్లాడుతూ ‘అడ్వెంచర్‌‌‌‌తో కూడిన ట్రెజర్‌‌‌‌‌‌‌‌ హంట్‌‌‌‌ లాంటి సినిమా ఇది.  అన్ని కమర్షియల్‌‌‌‌ అంశాలతో అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. నేను ఎలాంటి సినిమా చేశానో చూడటానికి మా నాన్నగారు (విజయ్‌‌‌‌) కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని చెప్పాడు.  ఈ సినిమాతో కోలీవుడ్‌‌‌‌కు పరిచయం అవడం సంతోషంగా ఉందని, తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పానని ఫరియా అబ్దుల్లా చెప్పింది.  ఇంట్రెస్టింగ్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని మైత్రీ శశిధర్ రెడ్డి చెప్పారు.